
సారా తయారీదారుల అరెస్ట్
తిరువూరు: ‘సారా ఏరులు’ శీర్షికన సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన వార్తకు ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. తిరువూరు సర్కిల్లో విస్తృత దాడులు చేశారు. గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో సారా కాస్తుండగా పెదగమళ్ల నరసింహారావు, కొత్తపల్లిలో పుప్పాల మోహనరావును తిరువూరు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ అరెస్టు చేశారు. కనుమూరులో పాత నేరస్తుడు జెర్రిపోతుల కోటేశ్వరరావును కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విస్సన్నపేట మండలంలో కూడా సారా కాస్తూ పలుమార్లు పట్టుబడిన నరసాపురానికి చెందిన ఉమ్మడి రాంబాబు, బాణావతు బుజ్జి, కాటూరి చెన్నారావు, వేమిరెడ్డిపల్లి తండాలో అజ్మీర బాబూరావులను విస్సన్నపేట తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నవోదయం 2.0లో భాగంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం, కనుమూరు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సారా నిషేధానికి కృషి చేస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
బెల్టుషాపులపై దాడి..
తిరువూరు పట్టణంలో అనధికారికంగా ఆంధ్రా, తెలంగాణ మద్యం విక్రయిస్తున్న పోతురాజు ధర్మ శ్రీను, గోపుల వినోద్‌కుమార్‌లను ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ అరెస్టు చేశారు. రోలుపడిలో ఈడే భారతమ్మ వద్ద 10 మద్యం సీసాలు, గుమ్మా నాగమణి వద్ద 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐలు వెంకటకుమార్, కృష్ణవేణి, టాస్క్‌ఫోర్ ఎస్‌ఐ శేఖర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment