మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి హుండీ కానుకల రూపంలో రూ.1,02,44,254 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు. 104 రోజులకు ఆలయం, అన్నదానం హుండీల ద్వారా రూ.1,02,44,254 నగదు, 48 గ్రాముల బంగారం, 2.188 కిలోల వెండి సమకూరాయిని ఈఓ తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అధికా రులు, పోలీస్ సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పెనమలూరు: జాతీయ బాడీబిల్డింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర జట్టుకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపి కయ్యారని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. పెనమలూరు మండలం కానూరులోని అశోక్‌జిమ్‌లో బుధవారం జరిగిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జాతీయ బాడీబిల్డింగ్ పోటీలు జరగనున్నాయి.
రాష్ట్ర జట్టుకు ఉమ్మడి జిల్లా నుంచి 55 కిలోల విభాగంలో సీహెచ్.దినేష్‌రెడ్డి, 60 కిలోల విభాగంలో ఎం.దినేష్, 66 కిలోల విభాగంలో కె.హరి, 75 కిలోల విభాగంలో సీహెచ్.గోపీచంద్ ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకా రులను ఉమ్మడి జిల్లాల బాడీబిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఈదా రాజేష్, అధ్యక్షుడు బి. మనోహర్, వైఎస్సార్ సీపీ తాడిగడప మునిసిపల్ అధ్యక్షుడు వేమూరి బాలకృష్ణ తదితరులు అభినందించారు. క్రీడాకారులకు అశోక్ జిమ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని అశోక్ తెలిపారు.
17 మందికి కారుణ్య నియామకాలు
చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక సూచించారు. విధి నిర్వహణలో మరణించిన వారికి కుటుంబ సభ్యులకు హారిక బుధవారం తన చాంబర్‌లో కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. 12 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఐదుగురిని టైపిస్ట్‌లుగా నియమించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ.. కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారు తమకు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: జాతీయ అంతర విశ్వ విద్యాలయాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మహిళల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన స్వపంతి, గ్రీష్మ, రక్షిత, చరితా రెడ్డి, ఉదయలక్ష్మి, అన్నపూర్ణాదేవి, ఉదయలక్ష్మి, సిరి, శిరీష, కీర్తిగాయత్రి జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. చైన్నెలోని అలగప్ప యూనివర్సిటీలో ఈ నెల 29 నుంచి జరిగే జాతీయ పోటీలకు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. జట్టును వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నరసింహం, రిజిస్ట్రార్ రాధికరెడ్డి వర్సిటీ ప్రాంగణంలో బుధవారం అభినందించారు. జట్టుకు మేనేజర్‌గా రాము, కోచ్‌గా పవన్ కుమార్ వ్యవహరిస్తారు.
షణ్ముఖుడి హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు


