మచిలీపట్నంటౌన్: మాదిగ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా నూతన కమిటీ నియామం గురువారం జరిగిందని సంఘ జిల్లా అధ్యక్షుడు బొకినాల కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో మాదిగ ఉద్యోగుల సంఘంజిల్లా ఉపాధ్యక్షుడిగా జె.అనీల్, మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా కటారి మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. సమావేశం అనంతరం మల్కాపట్నంలోని గుప్తా సెంటర్‌లో ఉన్న భారత మాజీ ఉప ప్రధాని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహానికి సంఘ నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దేవరపల్లి విక్టర్‌బాబు, సంఘ నాయకులు గండ్రపు శీనయ్యమాస్టార్, అద్దేపల్లి నిరంజన్‌రావు, కొక్కిలిగడ్డ చిట్టిబాబు, మట్టా జయప్రకాష్, గురువిందపల్లి విజయ్‌బాబు, సాయిబాబు, దాస్, శరత్, బండారు సోమేశ్వరరావు, రాజేష్, జూనపూడి గణేష్, ఇసుక పల్లి అజయ్, బండ్రపల్లి బాబీ, ఎస్ హనోక్, విజయ రత్నం, మరియకుమార్ తదితరులు పాల్గొన్నారు.


