సీపీఎస్ రద్దు కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ పి.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2023 డీఎస్సీ అభ్యర్థులను మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలన్నారు. ఐఆర్, పీఆర్సీ కమిషన్‌ను నియమించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఎఫ్‌ను, ఏపీజీఎల్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలన్నారు. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. ఉమ్మడి సర్వీస్‌రూల్స్ జీవోల ఆధారంగా అమలు చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకన విధుల్లో ఆరోగ్యపరంగా, వయసు మీరిన వారిని, గర్భిణులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు బి.కనకారావు, ఎంవీఎస్‌ఎన్ ప్రసాద్, ఐవీ రామారావు, టి.దస్తగిరి, డి.చంద్రశేఖర్, బి.లంకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


