కొనుగోళ్లు లేక డీలా
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
దిగుబడులు భళా..
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది.
కనులపండువగా..
దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారికి శ్వేత, హరిత వర్ణ పుష్పాలతో అర్చన చేశారు.
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానానికి బాపట్ల జిల్లా కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్షను విరాళంగా సమర్పించారు.
–8లోu
కంకిపాడు: సీజన్‌లు మారుతున్నాయే తప్ప అన్నదాత కష్టాలు మాత్రం తీరటం లేదు. ఏ ఏటికాయేడు కష్టాలు.. నష్టాలే. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే నాటికి ప్రభుత్వం రిక్తహస్తం చూపుతోంది. దీంతో సరైన మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రైతుల పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం కనబరుస్తోంది.
దిగుబడులు ఘనం..
రబీ వరి సాగులో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు విత్తనం, పైపాటు, సమగ్ర యాజమాన్య చర్యలకు రూ. 35 వేల వరకూ పెట్టి సాగు చేశారు. పంట చేతికొచ్చింది. ఎకరాకు సరాసరిన 42 నుంచి 45 క్వింటాళ్లు వరకూ దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. తెగుళ్ల బెడద తగ్గటంతో దిగుబడులు ఆశించిన మేరకు లభించాయని అంటున్నారు.
చితికిపోతున్న అన్నదాత..
దిగుబడులు చూసి ఆనందించే లోపే రైతులు దళారుల చేతిలో చితికి దిగాలు చెందుతున్నారు. పంట మార్కెట్‌కు చేరుతుండటంతో దళారులు, మిల్లర్లు పంట పొలాల్లోకి వెళ్లిపోతున్నారు. ఉన్న పళంగా కోసిన ధాన్యం కోసినట్లుగా మిల్లుకు తరలించేందుకు 75 కిలోల బస్తాకు రూ.1,250 నుంచి రూ.1,300 మాత్రమే ఇస్తామని నొక్కి మరీ పంటను తరలించుకుపోతున్నారు. కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవటంతో రైతులు కూడా చేసేది లేక దళారులకే అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
చలివేంద్రపాలెం సమీపంలో యంత్రంతో వరి కోత పనులు చేస్తున్న కూలీలు
7
న్యూస్‌రీల్
జిల్లాలో పరిస్థితి..
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సాగుకు అనుమతి అధికారికంగా లేదు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని పాలకులు, అధికారులు సూచించారు. అయితే బోర్లు సదుపాయం ఉన్న రైతులు, అపరాల పంట సాగుకు అనువుగా లేని భూముల్లో రైతాంగం రబీ వరి సాగు చేపట్టారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 12,285 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా ఎంటీయూ 1156, 1153, 1121, 1010, 1061, బీపీటీ 5204, పీఆర్ 126 విత్తన రకాలను రైతులు సాగుకు ఎంచుకున్నారు. మూడు రోజులుగా జిల్లాలోని పలు చోట్ల పంట చేతికి రావటంతో వరి కోత యంత్రాలతో వరి కోత పనులను నిర్వహిస్తున్నారు.
ప్రారంభమైన రబీ వరి కోతలు మార్కెట్‌కు చేరుతున్న ధాన్యం మద్దతు ధర కోసం అన్నదాతల అగచాట్లు
సమీక్షలు జరుగుతున్నాయి..
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఇంకా సమీక్ష జరుగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లపై చర్చించాలి. పది వేల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి సూచన ప్రాయంగా ఆదేశాలు వచ్చాయి. ఏ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రా లు తెరవాలి అన్నదానిపై చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.
– పద్మాదేవి, జిల్లా మేనేజరు,
జిల్లా పౌరసరఫరాల సంస్థ
కొనుగోలు కేంద్రాల ఊసేదీ?
తక్షణమే తెరవాలి..
రబీ వరి పంట చేతికొచ్చింది. ఎకరాకు రూ. 30 వేలకు పైగా పెట్టుబడులు అయ్యాయి. దిగుబడులు బాగా వచ్చాయి. ఖరీఫ్‌లో జరిగిన నష్టం నుంచి తేరుకోవాలంటే రబీలో కూడా మద్దతు ధర అందేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే అన్నదాతలకు మేలు జరుగుతుంది. త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేవాలి.
– నకరికంటి శేఖర్, కౌలు రైతు, ఈడుపుగల్లు
వరి కోత పనులు మూడు రోజులుగా సాగుతున్నాయి. పంట మార్కెట్‌కు చేరుతోంది. అయినా ఇప్పటి వరకూ రబీ వరి కొనుగోళ్లపై ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయలేదు. పౌరసరఫరాల సంస్థ పంట దిగుబడులు వచ్చే నాటికే రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేయటం, కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేయటం జరగలేదు. 12,285 ఎకరాల్లో వరి సాగు చేయటం ద్వారా 43,824 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 44,521 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనాలే ఉన్నాయి. ఖరీఫ్‌లో ఏర్పడిన నష్టాన్ని అధిగమించి ఒడ్డున పడాలనే ఆశతో రైతులు అనుమతులు లేకున్నా బోర్లు సదుపాయం ఉన్న భూముల్లో వరి సాగు చేసుకున్నారు. దిగుబడులు ఘనంగా వచ్చాయి. కానీ అధికారులు, పాలకులు రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించే విషయంలో వైఫల్యం చెందారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కొనుగోళ్లు లేక డీలా
కొనుగోళ్లు లేక డీలా
కొనుగోళ్లు లేక డీలా
కొనుగోళ్లు లేక డీలా
కొనుగోళ్లు లేక డీలా
కొనుగోళ్లు లేక డీలా


