అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అపార నష్టం

Apr 5 2025 2:08 AM | Updated on Apr 5 2025 2:08 AM

అపార

అపార నష్టం

అకాల వర్షం..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికొచ్చిన దశలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, పసుపు తడిసిపోయాయి. నున్న ప్రాంతంలో గాలివానకు మామిడి కాయలు రాలిపోయాయి. రబీలో సాగు చేసిన వరి దెబ్బతింది. వెన్నుదశలో ఉన్న వరికి సంబంఽధించి సుంకు రాలిపోయింది. ఇప్పటికే ఽగిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు మళ్లీ గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్లు, మళ్లీ తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరబోసేందుకు అదనపు భారం

కృష్ణాజిల్లాలో ఈ రబీ సీజనులో 4,750 హెక్టార్లలో మొక్కజొన్న, 4,816 హెక్టార్లలో వరిపంటను సాగు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో మామిడి పంట 22,500 హెక్టార్లలో సాగు చేశారు. కృష్ణా జిల్లాలోని దావులూరు, చలివేంద్రపాలెం, ప్రొద్దుటూరు, కంకిపాడు, ఈడుపుగల్లు, పునాదిపాడు ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న పంట తడిసిపోయింది. ఈ పంటను ఆరబోసుకునేందుకు ఎకరాకు రూ.5వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, ఈ అదనపు ఖర్చుతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు సంబంధించి రైతులు ఉడకబెట్టి ప్రస్తుతం కల్లాల్లో ఆరబోశారు. వర్షానికి తడిసి నాణ్యత దెబ్బతిని, కాటు వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం పసుపు రేటు క్వింటా రూ.9500 ఉందని, క్వింటా రూ.13వేలకు పైగా ఉంటే గాని గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. రబీలో వరి సాగు చేసిన రైతులు సైతం వరి కంకి దశలో ఉందని, సుంకు రాలిపోయి దిగు బడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నున్న ప్రాంతంలో ఎకరానికి పైగా అరటితోట పూర్తిగా నేలకు ఒరిగింది.

నేలరాలిన మామిడి కాయలు తడిసిన మొక్కజొన్న, పసుపు వరి పంటపైనా ప్రభావం ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతు గోరుచుట్టుపై రోకటిపోటులా వర్షం

మామిడి రైతుకు కోలుకోలేని దెబ్బ...

ఈ ఏడాది ఇప్పటికే నల్లతామరతో మామిడి పంట బాగా దెబ్బతింది. అరకొరగా కాసిన మామిడి కాయలు సైతం గురువారం వీచిన గాలులు, వర్షానికి రాలిపోయాయి. నున్న ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉద్యానవన అధికారుల లెక్క ప్రకారం 50 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండగా, కాసిన కొద్ది కాయలు నేల రాలిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే విధంగా మరోసారి వర్షం వస్తే మామిడి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని మామిడి రైతులు వణికి పోతున్నారు.

అపార నష్టం 1
1/3

అపార నష్టం

అపార నష్టం 2
2/3

అపార నష్టం

అపార నష్టం 3
3/3

అపార నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement