వైభవంగా శోభాయాత్ర
మచిలీపట్నంటౌన్: శ్రీరామనవమి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యాన ఆదివారం మచిలీపట్నం నగరంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సాయంత్రం హిందూ కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో వందలాది మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని జై శ్రీరామ్.. జై హనుమాన్.. నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ర్యాలీ వెంట, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పలువురు ముస్లింలు యాత్రలో పాల్గొన్న శ్రీరాముని భక్తులకు శీతల పానీయాలను అందజేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. శ్రీరాముని జీవిత విశేషాలను సమాజానికి తెలిపేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
వైభవంగా శోభాయాత్ర


