
దుర్గమ్మకు విశేష పుష్పార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం విశేష పుష్పార్చన చేశారు ఉత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం అమ్మవారికి చామంతి, సంపంగి పూలతో విశేష అర్చన నిర్వహించారు. తొలుత అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలను అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది కలసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి మూలవిరాట్‌కు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తెల్ల, పచ్చ చామంతి, సంపంగి, మల్లెలు, మందార పుష్పాలతో ఆలయ అర్చకులు అర్చన చేశారు. విశేష పుష్పార్చనలో ఉభయదాతలు, భక్తులు, ఆలయ అర్చకుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. ఉభయదాతలకు అమ్మవారికి అర్చన నిర్వహించిన పుష్పాలను అందజేశారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా వారిని అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

దుర్గమ్మకు విశేష పుష్పార్చన