పట్టుదల, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే పేదరికం అడ్డురాదని నిరూపిస్తున్నారు నిరుపేద కుటుంబానికి చెందిన యువతీ యువకులు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ తమను చదివిస్తున్నారని, వారి కష్టం వృథా కారాదని భావించి పట్టుదలతో లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తున్నారు. సోమవారం విడుదలైన టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నారు.
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లెకు చెందిన కొండ య్య, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. దంపతులు రోజూ నాపరాతి గనిలో కూలీ పనులకు వెళుతుంటారు. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ అతి కష్టం మీద పిల్లలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె మంజుల అనంతపురం జిల్లా గుత్తి ఏపీఆర్‌జేసీ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. పదిలో 9.3 గ్రేడ్ సాధించింది.
బనవాసిలో ఇంటరీ్మడియట్‌లో 977 మార్కులతో ప్రతిభ చాటుకుంది. తర్వాత ఓపెన్‌లో డిగ్రీ పూర్తి చేసుకుంది. అనంతపురంలో టీటీసీ పూర్తి చేసి అక్కడే టెట్‌కు కోచింగ్ తీసుకుంది. 2022లో నిర్వహించిన టెట్‌లో సైతం 150 మార్కులు సాధించింది. ఆ సమయంలో డీఎస్సీ ఆలస్యం అయింది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశ్నాపత్రం కష్టంగా వచ్చినా 150 మార్కులతో సత్తా చాటింది. తెలంగాణ డీఎస్సీలో 13వ ర్యాంక్ సాధించింది. కౌన్సెలింగ్‌కు 1:3 ప్రకారం పిలవడంతో ఉపాధ్యాయ పోస్టు స్వల్ప తేడాతో కోల్పోయింది. గ్రూప్–2 కొలువు సాధించడమే తన లక్ష్యం అని మంజుల పేర్కొంది.
గ్రూప్–2 సాధించడమే లక్ష్యం
టెట్ అర్హత పరీక్షలో 150 మార్కులు సాధించడం సంతోషంగా ఉంది. డీఎస్సీలో పాసై టీచర్ అయినా గ్రూప్–2 సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకోసం ప్రయత్నం చేస్తున్నాను. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. వారి ఆశయం నెరవేర్చేందుకు ప్రయతి్నస్తున్నాను. సమయాన్ని వృథా చేయకుండా చదవడం వల్లే అనుకున్నది సాధించగలిగాను.
– వడ్ల మంజుల
శభాష్ క్రాంతికుమార్
అవుకు: అవుకు మండలం నిచ్చెనమెట్లకు చెందిన తలారి కృష్ణయ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు క్రాంతికుమార్ టెట్ ఫలితాల్లో 150 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులకు మూడెకరాల పొలం ఉంది. ఉన్నంతలో పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు క్రాంతికుమార్ ప్రాథమిక విద్య నిచ్చెనమెట్లలో పూర్తి చేశాడు. పదో తరగతి వరకు గుండ్లశింగవరం ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటరీ్మడియెట్ నలంద కాలేజీలో చదివాడు. డిగ్రీ బనగానపల్లెలోని ఎస్వీ కళాశాలలో పూర్తి చేశాడు. టీటీసీ కూడా బనగానపల్లెలో చదువుకున్నాడు. కర్నూలులో మూడు నెలల పాటు కోచింగ్ తీసుకున్నాడు. 2018 డీఎస్సీలో 71.65 మార్కులు సాధించాడు. సోమవారం విడుదలైన టెట్ ఫలితాల్లో 150 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఎలాగైనా డీఎస్సీలో ప్రతిభ చాటి ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని లక్ష్యం పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment