భర్త ఇంటి ముందు భార్య ధర్నా
ఎమ్మిగనూరు రూరల్: ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకుని రెండు వారాలు కూడా గడవక ముందే వదిలేసి వెళ్లిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన మండల పరిధిలోని గుడేకల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ప్రవీణకు రెండు నెలల క్రితం ఓ వ్యక్తితో వివాహం నిశ్చయం కాగా అదే కాలనీకి చెందిన వివాహితుడు అజయ్.. తాను ప్రేమిస్తున్నానని, బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పడంతో కుదిరిన సంబంధాన్ని వదులుకుంది. తల్లిదండ్రులను కూడా కాదని అతడిని రెండో పెళ్లి చేసుకుంది.
వారం రోజులు కలిసి కాపురం చేసిన తర్వాత అజయ్ తనకు పని ఉందని, రెండు రోజులు తన బాబాయి ఇంటి వద్ద ఉండాలని వదిలి వెళ్లాడు. రెండు నెలలైనా ఇంటికి రాకపోవటంతో అజయ్ బాబాయి తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం.. తల్లిదండ్రులు ఇంటికి రానివ్వకపోవడంతో ఆమెకు దిక్కుతోచక భర్త ఇంటి వద్ద ధర్నాకు దిగింది. కాగా ప్రవీణ ఇంటికి వస్తుందని తెలిసి అజయ్ తల్లిదండ్రులు ముందే తాళం వేసి వెళ్లిపోయారు. పోలీసులు అక్కడకు చేరుకుని అజయ్‌ను రప్పిస్తామని సర్ధి చెప్పడంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment