31లోపు పీఎంశ్రీ స్కూళ్లలో పనులు పూర్తి కావాలి
కర్నూలు సిటీ: పీఎంశ్రీ కింద ఎంపికై న 52 స్కూళ్లను స్కూళ్లలో చేపట్టాల్సిన పనులను ఈనెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల సొసైటీ సెక్రటరీ, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య సమగ్ర శిక్ష ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం డీఈఓ చాంబర్‌లో సమగ్ర శిక్ష అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశలో ఆయన మాట్లాడారు. ఆయా స్కూళ్లలో క్రీడా మైదానాలు, ప్రయోగశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నెల చివరిలోపు ఖర్చు చేస్తే వెంటనే రెండో విడత నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. బిల్లుల అప్‌లోడ్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో జరుగుతున్న పనులపై సైతం ఆయన ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయితే నిధుల సమస్య వస్తుందని, నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్ పని తీరుపై అధికారులను అడిగి తెలుసుకుని ఎక్కడెక్కడ పని చేయడం లేదో నోట్ చేసుకున్నారు. సమావేశంలో డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్, సమగ్ర శిక్ష ఇంజినీర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment