రైతుల ఆవేదన పట్టదా? | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆవేదన పట్టదా?

Published Fri, Feb 21 2025 8:41 AM | Last Updated on Fri, Feb 21 2025 8:37 AM

రైతుల ఆవేదన పట్టదా?

రైతుల ఆవేదన పట్టదా?

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారని కాటసాని అన్నారు. జిల్లాల్లో పర్యటనలు చేస్తున్న జగన్‌కు కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేకపోతోంద ని విమర్శించారు. రాష్ట్ర ప్రజలే జగన్‌కు రక్షణగా ఉంటారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి రేట్లు పెంచారన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ రేణుక, కార్పొరేటర్లు శ్వేతారెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంతరెడ్డి, నాగ లక్ష్మిరెడ్డి, సాన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు: పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పట్టదా అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులపై తన స్వగృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూపి టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. గుంటూరు మిర్చి మార్కెట్‌లో రైతులు గిట్టుబాటు ధరరాక పడుతున్న బాధలను చూసి వారితో మాట్లాడాటానికి వెళ్లిన వైఎస్‌ జగన్‌పై కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పంటల దిగుబడులు కొనుగోలు చేయాలి

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని, పసుపు, మిర్చి, ఉల్లితో పాటు మొత్తం 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గతేడాది మిర్చి క్వింటా ధర రూ.21వేల నుంచి 22వేల వరకు లభించిందన్నారు. ప్రస్తుతం క్వింటాళ్లు రూ. 8వేల నుంచి 11వేలకు పడిపోయిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెగుళ్లు కారణంగా పంట దిగుబడులు తగ్గాయన్నారు. ఎకరాకు 10 క్వింటాళ్లు మించి రాలేదని, పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు సుమారుగా రూ. 1.50 లక్షలు అవుతుందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించే వారు లేరన్నారు. వెంటనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలన్నారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించరా?

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement