ఇంటర్ పరీక్షలకు 69 కేంద్రాలు
కర్నూలు(సెంట్రల్): ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. గురువారం సాయంత్రం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు 23,098 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 22,227 మంది పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. ప్రశ్న పత్రాల భద్రతకు పటిష్ట ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూయించాలని, అలాగే 144 సెక్షన్ విధించాల న్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అడిషినల్ ఎస్పీ, డీఆర్వో, ఆర్‌ఐఓ పాల్గొన్నారు.
కార్మికులకు ‘ఈ శ్రమ్’ భద్రత
ఈ శ్రమ్ కార్డుతో అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. జిల్లాలోని అసంఘటితరంగ కార్మికులను ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ శ్రమ్‌లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ.2లక్షల బీమా ఉచితంగా లభిస్తుందన్నారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని కార్మిక శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు ఇచ్చారు.
మార్చి 15 వరకు ఎంఎస్‌ఎంఈ సర్వే
జిల్లాలో మార్చి 15వ తేదీ వరకు నిర్వహించే ఎంఎస్‌ఎంఈ సర్వేకు పరిశ్రమల యజమానులు సహకరించాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సర్వే ద్వారా పరిశ్రమల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తారన్నారు.
కొనసాగుతున్న పీ4 సర్వే
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 సర్వే జిల్లాలో కొనసాగుతుంతోందని సీఎస్ విజయానంద్‌కు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా వివరించారు. పీ4 సర్వే ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమైందని, మార్చి 2వ తేదీ ముస్తుందని తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం వివిధ అంశాలపై సీఎస్ సమీక్షించారు. జిల్లాలో గ్రూపు–2 మెయిన్స్, ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సీఎస్‌కు జిల్లా కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వోసి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు.
అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు
జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment