కర్నూలు(అగ్రికల్చర్): పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయడంలో ఆలస్యమైందని, ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి కోరారు. ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం కర్నూలు లోని ఎన్‌జీవో హోంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల అర్థిక ప్రయోజనాలను తక్షణం విడుదల చేయాలన్నారు. సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్, కోశాధికారి భాస్కరనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, రమణలను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి విధులన్నీ కేసీహెచ్ కృష్ణుడు నిర్వహి స్తారని ప్రకటించారు. రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, జిల్లా కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు, నాయకలు ఎంసీ కాశన్న, రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment