గ్రూపు–2 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలను ఈనెల 23న పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గ్రూపు–2 మెయిన్స్ కోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 9,993 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సందేహాలకు 08518–277305 నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, ట్రైనీ కలెక్టర్ కల్యాణి, అడిషినల్ ఎస్పీ(అడ్మిన్) హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, ఏపీపీఎస్‌సీ డెప్యూటీ సెక్రటరీ కుమార్‌రాజు, అసిస్టెంట్ సెక్రటరీ బహ్మేశ్వరరావు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల సమీపంలో
జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలి
● కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్
కర్నూలు(అర్బన్): ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నారని, అదే రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్‌నెట్, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కే వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లాలోని నిర్ణీత కేంద్రాల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్‌నెట్, జిరాక్స్ కేంద్రాలు తెరిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment