పరమేశ్వరా.. నీ దర్శనం కష్టమాయె!
● క్యూలైన్ల ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
● తొక్కిసలాటకు అవకాశం ఉండటంతో
భయాందోళన
శ్రీశైలంటెంపుల్: శివదీక్షా భక్తులకు మల్లన్న దర్శనం కష్టంగా మారింది. ఎంతో భక్తితో 40 జులు శివమాల స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడి సమర్పించేందుకు శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తుండడంతో శివస్వాములు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. శివస్వాములకు ఏటా ఏర్పాటు చేస్తున్నట్లుగానే చంద్రావతి కల్యాణమండపంలో కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. అయితే అధికసంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో ఆరుబయటే రోడ్డుపై భక్తులు కూర్చుంటున్నారు. శివస్వాములకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన దేవస్థానం ఆదిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. శివస్వాములకు కంపార్ట్‌మెంట్ల నుంచి మల్లన్న దర్శనానికి వెళ్లేందుకు ఒక్క భక్తుడు పట్టే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయడం, దర్శనానికి ఒక్కసారిగా శివస్వాములందరూ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. ఇలాగేనా క్యూలైన్ ఏర్పాటు చేసేది అని శివస్వాములు మండిపడుతున్నారు. గంటల తరబడి మల్లన్న స్పర్శదర్శనానికి వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని భక్తులు అవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment