రేనాటి సూరీడు ‘ఉయ్యాలవాడ’
కర్నూలు కల్చరల్: రేనాటి సూరీడు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని వక్తలు అన్నారు. కర్నూలు ఎ.క్యాంప్‌లోని నరసింహారెడ్డి విగ్రహం వద్ద ఉయ్యాలవాడ వర్ధంతిని ఉయ్యాలవాడ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీ నవ్య, కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కేడీసీసీబీ మాజీ చైర్‌పర్సన్ ఎస్వీ విజయమనోహరి హాజరయ్యారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. దేశం కోసం చేసిన నరసింహారెడ్డి త్యాగం మరువలేనిదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ శిస్తు కోసం రైతులను పట్టి పీడించడాన్ని నరసింహారెడ్డి అడ్డుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కాటసాని, ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బిట్రీష్ వారిని గడగడలాడించిన మహావీరున్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అనంతరం పలువురు ప్రముఖులను సన్మానించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సేవా సమితి అఽధ్యక్షులు విజయమోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, కోశాధికారి తిలక్, సభ్యులు ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, సహకార్యదర్శులు జితేంద్ర, రమణారెడ్డి, మానవత ప్రతినిధులు పాల్గొన్నారు.
రేనాటి సూరీడు ‘ఉయ్యాలవాడ’
Comments
Please login to add a commentAdd a comment