ప్యాపిలి: మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డోన్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ మంగమూరి గోపాల్ (37) మృతి చెందాడు. డోన్ త్రివర్ణ కాలనీలో నివాసం ఉంటున్న మంగమూరి గోపాల్ మెట్టుపల్లి గ్రామంలో జరిగిన దేవరకు హాజరయ్యాడు. అనంతరం ద్విచక్రవాహనంపై డోన్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. మెట్టుపల్లి శివారు ప్రాంతంలోని సుంకులమ్మ గుడి వద్ద గేదెను తప్పించే క్రమంలో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుధారాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి సంతాపం
వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ మంగమూరి గోపాల్ మృతి పట్ల మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగడి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేశ్, వైస్ చైర్మన్ జాకీర్ హుసేన్, వలంటీర్ పార్టీ విభాగం అధ్యక్షులు పోస్టు ప్రసాద్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.


