● జిల్లా చైర్మన్‌గా సేవలాల్ నాయక్
కర్నూలు సిటీ: ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) జిల్లా నూతన కార్యవర్గాన్ని (2025–27 సంవత్సరాలకు) బుధవారం ఎన్నుకున్నారు. కర్నూలులోని సలాంఖాన్ భవనంలో ఫ్యాఫ్టో అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫ్యాప్టో జిల్లా నూతన కమిటీ చైర్మన్‌గా అప్టా(ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సేవలాల్ నాయక్ ను ఎన్నుకున్నారు. అలాగే సెక్రటరీ జనరల్‌గా జి.భాస్కర్ (బి.టీ.ఏ), కో చైర్మన్లుగా వై.నారాయణ(ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం), వి.జి వెంకట్రాములు(డిటీఎఫ్), ఎల్.గులాబీ బాషా(రూట), రాజేష్(ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా యు.రవికుమార్ (యూటీఎఫ్), టి.కె జనార్దన్(ఎస్టీయూ), ఎస్.ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్1938), కోశాధికారిగా ఎన్.రంగన్న(ఏపీటీఎఫ్ 257)ఎన్నికయ్యారు. ఎన్నిక కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా, రాష్ట్ర ఫ్యాఫ్టో కో–చైర్మన్ కాకి ప్రకాష్ రావు వ్యవహరించారు. ఆయా సంఘాల నాయకులు నవీన్ పాటిల్, ఎస్.గోకారి, మరియానందం, తిమ్మప్ప, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ్యాప్టో జిల్లా నూతన కార్యవర్గం
ఫ్యాప్టో జిల్లా నూతన కార్యవర్గం


