పాణ్యం: బపలనూరు మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతి చెందగా, మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. పిన్నాపురం గ్రామానికి చెందిన గని వెంకటసుబ్బయ్య, ఓరుగంటి సుధాకర్, ఒరుగంటి వెంకటకృష్ణ, మిద్దె రమణయ్య, మూగ ధనికొండకు చెందిన జీవాలను మేత కోసం తీసుకెళ్తూ బపలనూరు మెట్ట గురువారం తెల్లవారుజామున రోడ్డు దాటిస్తున్నారు. వేగంగా వస్తున్న లారీ గమనించి బ్రేకులు వేసేలోపే లారీ కింద పడి అకక్కడిక్కడే 20 గొర్రెలు మృతి చెందాయి. కాగా ఈ ప్రమాదంలో రహదారిపై లారీ నిలిచిపోయింది. అదే సమయంలో కర్నూలు వైపు నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొని నిలిచిపోయింది. వెనుక వస్తున్న మరో లారీ బస్సును ఢీకొంది. కాగా బస్సులో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీ, బస్సును స్టేషన్‌కు తరలించారు.
20 గొర్రెలు మృతి
నిలిచిన లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
బస్సును ఢీకొన్న మరో లారీ


