ఎరక్కపోయి వచ్చి ఓ శునకం ఇరుక్కుపోయింది. మండు వేసవిలో మూగ జీవాల నీటి కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఇందుకు నిదర్శనం ఈ కుక్క కష్టమే. నంచర్ల సమీప పొలంలో గురువారం గొర్రెల కాపరులు బిందెలో నీటిని తెచ్చుకుని తాగారు. కొంచెం నీరు మిగలడంతో ఒక చోట ఉంచారు. అటుగా వచ్చిన ఒక కుక్క దాహం తీర్చుకోవడానికి బిందెలో తల దూర్చడంతో ఇరుక్కుపోయి విలవిలాడింది. భయంతో బిందెతోనే పరుగులు తీసి రహదారిపైకి చేరుకుంది. కొందరు వాహనదారులు గమనించి చాలా కష్ట పడి చివరకు బిందెను తొలగించడంతో ఊపిరిపీల్చుకుంది. – చిప్పగిరి


