కర్నూలు(అర్బన్): అసంఘటి త రంగాల్లోని, వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ–శ్రమ్ నమోదు లక్ష్యం 14,07,281 కాగా, ఈ నెల 25వ తేది వరకు 6,39,247 మంది నమోదు చేసుకున్నారు. నమోదుకు ఈ నెలాఖరు వరకు సమ యం ఉన్నట్లు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ –శ్రమ్ నమోదుతో కార్మికులు దురదృష్టవశాత్తూ మృతి చెందినా, అంగవైకల్యం ఏర్పడినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్నారు.
ఎవరు అర్హులంటే ...
● 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి.
● అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు, ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు.
● ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, భవన నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళ లు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, వ్యవ సాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ కూలీలు, కుమ్మరి, స్వర్ణకారులు, ఇతర చేతివృత్తుల వారు, వాహన చోద కులు, వీధి వ్యాపారులు, సేవా రంగంలో ఉన్న వారు.
ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
● ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షికంగా గాయపడితే రూ.లక్ష ఆర్థిక సహాయం అందుతుంది.
● వలస కార్మికులకు రాష్ట్రంలో లేదా వారి సొంత ప్రాంతంలో ఎక్కడా రేషన్‌కార్డు లేకుంటే పౌర సరఫరాల శాఖ ద్వారా మంజూరు చేసే నిత్యావసర సరుకులు అందజేస్తారు.
● ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
ఇలా నమోదు చేసుకోవాలి ...
ఈ–శ్రమ్ నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా కార్మిక శాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే ఆన్‌లైన్ పద్ధతిలో నమోదు చేస్తారు. నామినీ ఆధార్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. నమోదు పూర్తయిన అనంతరం యూఏఎన్ గుర్తింపు కార్డు జారీ అవుతుంది.
నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం
ఈ–శ్రమ్‌తో సామాజిక భద్రత


