కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం(బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.హరినాథ్‌చౌదరి, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 856 మంది ఓటర్లు ఉండగా 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన పి.హరినాథ్‌చౌదరి తన సమీప ప్రత్యర్థి బి.మురళీమోహన్‌పై 92 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి జరిగిన పోటీలోఎం. వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి ఎం.ఆంజనేయులుపై 76 ఓట్లతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన ఎం. బాలసుబ్రమణ్యం తన ప్రత్యర్థి బీకే నాగారుజుపై 411 ఓట్లతో గెలిచారు. లైబ్రరీ సెక్రటరీ స్థానానికి పోటీలో ఉన్న పి.చంద్రశేఖర్ తన ప్రత్యర్థి సంపత్‌పై భారీ ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష, కోశాధికారి, క్రీడా కార్యదర్శి మహిళాప్రతినిధి స్థానాలకు త్రివిక్రమ్, గౌతంమానె, బెస్త సుధాకర్, కె. అరుణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు జి.విజయకుమార్, కె.రంగనాథ్,సి. ప్రభాకరరెడ్డి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్,
వెంకటేశ్వర్లు


