కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహ కార కేంద్రబ్యాంకును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి జవాబుదారీతనంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్, పర్సన్ ఇన్‌చార్జీ కమిటీ చైర్మన్ బి.నవ్య అన్నారు. గురువారం డీసీసీబీ బోర్డు సమావేశం, మహా జనసభలు జేసీ ఆధ్వర్యంలో జరిగాయి. రికవరీలను ముమ్మరం చేసి ఇటు సంఘాలు, అటు డీసీసీబీ బలోపేతానికి తోడ్పడాలని జేసీ పేర్కొన్నారు. కంప్యూటరీకరణలో భాగంగా 68 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఈ–ప్యాక్స్‌లుగా మారాయన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తయారు చేసిన బడ్జెట్ ప్రతిపాదనలను జేసీ ఆమోదించారు.కర్నూలు, నంద్యాల డీసీవోలు ఎన్.రామాంజనేయు లు, వెంకటసుబ్బయ్య, డీసీసీబీ సీఈవో విజయకుమార్, జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు పాల్గొన్నారు.


