ఆస్పరి: ఆదోని – పత్తికొండ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆస్పరి సీఐ మస్తాన్‌వలి తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామానికి చెందిన బోయ మహానంది (40) గురువారం పని నిమిత్తం బైక్‌పై ఆస్పరికి చేరుకున్నారు. పని ముగించుకొని రాత్రి స్వగామానికి బైక్‌పై తిరిగి వెళ్తుండగా పత్తికొండ నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహానందిని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి ఆదోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందతూ కొలుకోలేక మృతి చెందాడని సీఐ తెలిపారు. మృతుడుకి భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.