బాల్యమిత్రుల ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

బాల్యమిత్రుల ఆర్థిక సాయం

Mar 30 2025 2:33 PM | Updated on Mar 30 2025 2:33 PM

బాల్య

బాల్యమిత్రుల ఆర్థిక సాయం

హొళగుంద: అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితునికి బాల్యమిత్రులు రూ.41 వేలు ఆర్థిక సహాయం చేశారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హొళగుంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2005–06లో మార్లమడికి గ్రామానికి చెందిన రామంజితో పాటు పలువురు చదువుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ రామంజి.. కర్నూలులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న 50 మంది బాల్య స్నేహితులు తలా ఇంత ఇచ్చి.. రూ.41 వేలు చేశారు. అందరి తరఫున శుక్రవారం స్నేహితులు పెద్దహ్యాట మల్లయ్య, వార్డు సభ్యుడు చిన్న మల్లయ్య, తిమ్మారెడ్డి, సుధాశెట్టి, ద్యావన్నలు కర్నూలుకు వెళ్లి రామాంజిని పరామర్శించి రూ. 41,000 నగదును అతని చేతికి అందజేశారు.

విద్యుత్‌ చార్జీల

భారం తగ్గించాలి

కర్నూలు(అగ్రికల్చర్‌): కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్‌ ట్రూ అఫ్‌ చార్జీలను, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్‌భవన్‌ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలను పెంచబోమని చెప్పిన కూటమి నాయకులు తర్వాత ట్రూ అప్‌చార్జీలు, సర్దుబాటు పేరుతో అడ్డుగోలుగా చార్జీలు పెంచడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేంచిన టీడీపీ నేడు వాటిని ఏర్పాటు చేస్తూ వినియోగదారులపై భరించలేని భారం మోపుతోందని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల వ్యాపార, పారిశ్రామికవేత్తలపై ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు భారం పడుతుందన్నారు. అలాగే స్మార్ట్‌ మీటర్ల వల్ల వేలాది మంది మీటర్‌ రీడింగ్‌ సిబ్బంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీ.రాముడు, రాధాకృష్ణ, ఎండీ ఆనంద్‌, ఓల్డ్‌సీటీ కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, గురుశేఖర్‌, విజయ్‌ పాల్గొన్నారు.

అనుమానం పెనుభూతమై..

వెలుగోడు:మోత్కూరు మజారా గ్రామమైన తిమ్మనపల్లి గ్రామంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. కట్టుకున్న భర్తనే భార్యను కడతేర్చాడు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామానికి చెందిన పసుల లక్ష్మీదేవి (32)కి తిమ్మనపల్లి గ్రామానికి చెందిన మధు చిన్ని కృష్ణతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి సంసారం కొన్ని సంవత్సరాలు సజావుగా సాగింది. కాగా భార్యపై అనుమానం పెనుభూతమైంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మధు చిన్ని కృష్ణ తన భార్య లక్ష్మీదేవి తలపై గొడ్డలి కామాతో దాడి చేయగా తీవ్ర రక్త గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు రూరల్‌ సీఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, వెలుగోడు ఏఎస్‌ఐ శేషా వలి గ్రామానికి చేరుకుని హత్యకు కారణాలపై ఆరా తీశారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాల్యమిత్రుల ఆర్థిక సాయం 1
1/2

బాల్యమిత్రుల ఆర్థిక సాయం

బాల్యమిత్రుల ఆర్థిక సాయం 2
2/2

బాల్యమిత్రుల ఆర్థిక సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement