సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
కోసిగి: నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు తెలిపారు. శుక్రవారం కోసిగి ఎకై ్సజ్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 110 గ్రామాల్లో నాటుసారా తయారీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయా గ్రామాల్లో నవోదయం 2.0లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీసులతో, ప్రచారం రథం ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. నాటుసారా స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామన్నారు. కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా పూర్తి తగ్గి పోయిందన్నారు. కర్ణాటక టెట్రా ప్యాకెట్లు అక్కడక్కడ సరఫరా అవుతోందని, వాటిని అరికట్టేలా సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలతో జిల్లా ఆదాయం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. కోసిగి ఎకై ్సజ్ సీఐ భార్గవ్ రెడ్డి, జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.


