అన్ని రంగాల్లో జిల్లాను అభివృది ్ధచేస్తాం
కర్నూలు(సెంట్రల్): అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ అన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలకు విలువను ఇచ్చి పట్టు పంచలు, అంగీలు, పైజామాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ సాగుతోందన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌లో పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వృద్ధి రేటు 11.56గా ఉందని, దానిని ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 16 శాతానికి తీసుకెళ్తామన్నారు.
● ఒక వేద పండితునితోపాటు ముగ్గురు అర్చకులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సన్మాన గ్రహీతలకు ఒక్కొకరికి రూ.10,116 సంభావన, శాలువలను ఇచ్చారు.
● వివిధ రంగాల్లో నిష్ణాతులైన 11 మందిని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది. వారందరినీ మంత్రి, కలెక్టర్ సన్మానించి పురస్కారాలు అందజేశారు. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహించిన వారికి, గొరవయ్యలకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూ లు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. వేడుకల్లో కలెక్టర్ దంపతులు ఆకర్షణగా నిలిచారు.
ప్రజాప్రతినిధుల డుమ్మా...
రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కర్నూలులోనే నివాసం ఉంటున్నా హాజరు కాలేదు.
మంత్రి టీజీ భరత్
అన్ని రంగాల్లో జిల్లాను అభివృది ్ధచేస్తాం


