‘విశ్వావసు’కు భక్తి పూర్వక స్వాగతం
కోడుమూరులో
అశేషజనం మధ్య
సాగుతున్న
శ్రీవల్లెలాంబాదేవి
రథోత్సవం
‘విశ్వావసు’ నామ సంవత్సరానికి జిల్లా ప్రజానీకం భక్తి పూర్వక స్వాగతం పలికింది. ఆదివారం భక్తులు తమ ఇష్ట దేవతామూర్తుల ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ నూతన తెలుగు సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవతలు సుంకులమ్మ, రేణుకా ఎల్లమ్మ, సవారమ్మ, మారెమ్మ, జంబులమ్మ, తదితర జగన్మాతలకు చీరెలు, సారెలు, నైవేద్యాలు సమర్పించారు. రైతులు తమ వృషభాలను ప్రత్యేకంగా అలంకరించి గ్రామాల్లో ఊరేగిస్తూ ఆలయాలను సందర్శించి కొబ్బరి కాయలు సమర్పించారు. పొలాలకు వెళ్లి సేద్యం చేసి ఈఏడాది సాగును ప్రారంభించారు. ప్రముఖ ఆలయాల్లో వేద పండితులు, మిగతా ఆలయాల్లో అక్కడి పురోహితులు పంచాంగ శ్రవణం చేశారు. – సాక్షి, నెట్‌వర్క్


