ధూమపానం వల్ల క్యాన్సర్
బీడీ, సిగరెట్ తాగే వారిలో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్‌లు వస్తాయి. బీడి, సిగరెట్ అధికంగా తాగే వారిలో చేతులు, కాళ్లలోని నరాలు మూసుకుపోతాయి. ఫలితంగా కాళ్లు, చేతుల్లో రక్తప్రసారం తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్లు, చేతులు నల్లగా మారిపోయి తీవ్ర నొప్పిని కలుగజేస్తున్నాయి. గ్యాంగ్రిన్‌గా మారిన కాలు, చేతిని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. – డాక్టర్ సి.వాసురెడ్డి,
సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు
గుండె సమస్యలకు
దారి తీస్తుంది
రోజూ ధూమపానం చేసే వారిలో, చేయని వారితో పోలిస్తే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. సిగరెట్ తాగడం వల్ల గుండెపోటుతో పాటు బ్రెయిన్‌స్ట్రోక్, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కాళ్లలో ధమనులు గట్టిగా మారడం సంభవిస్తాయి. ధూమపానం గుండె కండరాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఈ కారణంగానే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ అలవాటుంటే నెమ్మదిగా దానికి దూరం కావాలి.
– డాక్టర్ లక్ష్మణస్వామి,
కార్డియోవాస్కులర్ సర్జన్, కర్నూలు
ధూమపానం వల్ల క్యాన్సర్


