సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రధానం
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యం పరికరాల్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలని, అప్పుడే డ్రిప్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య లక్ష్యం 7,000 హెక్టార్లు ఉండగా ... 5,653 హెక్టార్లకు పరిపాలన అనుమతులు తీసుకున్నామన్నారు. బుధవారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో ఉద్యాన అధికారులు, డ్రిప్ కంపెనీల ఇంజినీ ర్లు, జిల్లా కో–ఆర్డినేటర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ పాల్గొని ప్రసంగించారు. పరిపాలన అనుమతులు పొ ందిన వారందరికీ మే చివరిలోపు డ్రిప్ పరికరాలు సరఫరా చేసి, అమర్చాలని కంపెనీల కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. ఏపీడీ రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం ప్రగతిలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. ఇందుకు సహకరించిన కంపెనీల కో–ఆర్డినేటర్లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు, సూ క్ష్మనీటి అభివృద్ధి అధికారి జయరాంరెడ్డి పాల్గొన్నారు.


