న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ ఎన్నిక

Apr 6 2025 12:19 AM | Updated on Apr 6 2025 12:19 AM

న్యాయ

న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ ఎన్నిక

కర్నూలు(సెంట్రల్‌): జిల్లా న్యాయశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కోర్టుకు ఎదరుగా ఉన్న క్లబ్‌ క్యాంటీన్‌లో న్యా యశాఖ ఉద్యోగులు సమావేశమయ్యారు. స మావేశంలో జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎకై ్సజ్‌ కోర్టులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈ.దేవేంద్రగౌడ్‌, జనరల్‌ సెక్రటరీగా పీడీఎం కోర్టు స్టెనోగ్రాఫర్‌ ఎన్‌.గోపాల్‌, ట్రెజరర్‌గా ప్రిన్సిపల్‌ కోర్టు జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.శివరాముడులతోపాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కమిటీ సభ్యుల ను అందరి ఆమోదంతో ఎన్నుకున్నారు.

ఇంట్లో ఆరడుగుల కోడెనాగు

మహానంది: శ్రీనగరం గ్రామానికి చెందిన కృష్ణకుమారి ఇంట్లో శనివారం సాయంత్రం పెద్ద నాగుపాము కనిపించింది. ఇంట్లో ఉన్న ఓ బాలుడిని కాటేసేందుకు ప్రయత్నించగా త్రుటిలో తప్పించుకున్నాడు. పాము బయటి కి వెళ్లకపోవడంతో అయ్యన్ననగర్‌ గ్రామానికి చెందిన స్నేక్‌ క్యాచర్‌ మోహన్‌కు సమాచారం అందించగా అతడు అక్కడికి చేరుకుని ఆరు అడుగుల నాగుపామును పట్టుకుని సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు.

వ్యక్తి ఆత్మహత్య

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని ముగతి పేటలో ఉరివేసుకొని బాలచంద్ర(37) ఆత్మహత్య చేసుకున్నట్లు టౌన్‌ సీఐ వి. శ్రీనివాసులు శనివారం రాత్రి తెలిపారు. ముగతి పేటకు చెందిన బాలచంద్ర, గౌతమిలకు ఇద్దరు కుమారులు. మగ్గం వేసుకుంటూ జీవనం సాగించేవాడు. స్థానిక హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇంటి ఖర్చులు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ ఎన్నిక 1
1/1

న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement