శ్రీశైలం డ్యాం ఈఈగా వేణుగోపాల్
శ్రీశైలంప్రాజెక్ట్: నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా ఎం.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రాజెక్టుకు ఈఈ లేకపోవడంతో డ్యాంకు సంబంధించిన మెయింటెనెన్స్, అదనపు పనులను చేపట్టలేక పోతున్నారు. దీంతో నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్–1, డివిజన్–3లో ఈఈగా పనిచేస్తున్న వేణుగోపాల్‌రెడ్డిని ఫుల్ అడిషనల్ చార్జ్ ఈఈగా శ్రీశైలం డ్యాంకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఈఈ వేణుగోపాల్‌రెడ్డిని డ్యాం డివిజన్ ఉద్యోగులు శాలువాతో సత్కరించారు.


