రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయాలి
కర్నూలు (అర్బన్): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాల గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు. గురువారం రాత్రి స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని ఎంపీపీ హాల్‌లో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అసోసియేషన్ చైర్మన్ సోమన్న, కో–చైర్మన్ భాస్కర్, కోశాధికారి డాక్టర్ వై.రాజశేఖర్, కన్వీనర్ చంద్రశేఖర్, కో–కన్వీనర్ మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మాలల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి మాలల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించిన గోన నాగరాజును ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు.


