బంపరాఫర్‌! ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌.. తెలంగాణ ప్రభుత్వ చర్యలు | - | Sakshi
Sakshi News home page

బంపరాఫర్‌! ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌.. తెలంగాణ ప్రభుత్వ చర్యలు

Published Sat, Mar 11 2023 9:20 AM | Last Updated on Sat, Mar 11 2023 7:15 PM

వరంగల్‌ జక్కలొద్ది గురుకులంలో ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు - Sakshi

వరంగల్‌ జక్కలొద్ది గురుకులంలో ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు

న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్‌ పూర్తి చేసిన వెంటనే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ (టెమ్రిస్‌) ఆదిశగా ముందడుగేసింది. ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రపంచస్థాయి ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఇప్పించేందుకు ముందుకొచ్చి ంది.

ఈమేరకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలున్నాయి. వీటన్నింటినీ జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీతో పాటు వృత్తి విద్యను అందిస్తున్నారు. విద్యార్థుల ఛాయిస్‌ అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు సెక్రటరీ షఫియుల్లాతో పాటు టెమ్రిస్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

ఎంపిక ఇలా..
విద్యార్థుల ఎంపిక కోసం ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ను హెచ్‌సీఎల్‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఈటెస్ట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన మూడు గురుకులాల్లో నిర్వహిస్తున్నారు. బాల బాలికలకు వేర్వేరుగా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ పూర్తయ్యాక ఇంటర్‌ వ్యూ తీసుకుంటారు. ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్‌లో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఎంట్రీ లెవల్‌ ఐటీ జాబ్‌కి ఎంపిక చేస్తారు.

అనంతరం ఆర్నెళ్ల పాటు క్లాస్‌రూమ్‌ ట్రైనింగ్‌(సీఆర్టీ), మరో ఆర్నెళ్ల పాటు ఆన్‌ ది జాబ్‌(ఓజేటీ) శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పూర్తి స్థాయిలో ఉద్యోగంలోకి తీసుకుని వారికి సంవత్సరానికి రెండులక్షల పైచీలకు వేతనం అందించి వీకెండ్స్‌లో ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అందించనున్నారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌ కేంద్రాలివే..

రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేంద్రాలుండగా.. కరీంనగర్‌, ఖమ్మం వరంగల్‌ జిల్లాల విద్యార్థులు (వరంగల్‌ రంగశాయిపేట శివారు జక్కలొద్ది బాలుర–1) గురుకులంలో పరీక్ష రాస్తున్నారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల్లో 257 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.

ఇంటర్‌ పూర్తవగానే ఉద్యోగం
ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ తీసుకున్న ప్రతిభ గల విద్యార్థులు సెకెండ్‌ ఇయర్‌ పూర్తవ్వగానే ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌లో (హెచ్‌సీఎల్‌–టెక్‌బీ) ప్రోగ్రామ్‌లో భాగంగా ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి కంపెనీ వారికి ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. టెస్టులో ఎంపికై న విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ కల్పించి ఏడాది పాటు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణలో వారికి రూ.12 వేలు ఉపకార వేతనం కూడా అందజేస్తుంది. ఇటు ఉద్యోగ అవకాశంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా తోడ్పాటు అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement