● కరీమాబాద్‌లో ఘటన
● ఆలస్యంగా వెలుగులోకి..
ఖిలా వరంగల్ : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కరీమాబాద్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన బొల్లు రాకేశ్ (25) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లి నిమిత్తం శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం పెళ్లికి వెళ్లిన రాకేశ్ ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించాడని తల్లి రజిత మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, మెడపై గాయాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం తల్లి రజితకు సోమవారం సాయంత్రం మృతదేహాన్ని అప్పగించారు. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment