
వైద్యపరీక్షలకు వెళ్లి వచ్చేలోగా..
మహబూబాబాద్ రూరల్ : వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వచ్చేలోగా ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 10.50 తులా ల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.88 వేల నగదు అపహరణకు గురైంది. మహబూబాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కా లనీలో నివాసముండే మహబూబ్ అలీకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. తిరిగి కుటుంబ స భ్యులు ఈ నెల 17వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపు తా ళం పగులగొట్టి ఉంది. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీ రువా తలుపులు తొలగించి ఉన్నా యి. అందులోని 10.50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణా లు, రూ.88 వేల నగదు కనిపించలే దు. దీంతో చోరీ జరిగిందని భావించిన మహబూ బ్ అలీ, అలీ మాబీ దంపతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ ఎస్సై శివ ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
10.50 తులాల బంగారు,
30 తులాల వెండి ఆభరణాలు,
రూ.88 వేల నగదు అపహరణ
మహబూబాబాద్‌లో ఘటన
Comments
Please login to add a commentAdd a comment