
చిందుబాగోతం.. ప్రాచీన జానపద కళారూపం
పాలకుర్తి టౌన్ : తెలుగు జానపద కళారూపాల్లో చిందు బాగోతం ప్రముఖమైందని చిందు యక్షగాన కళాకారుడు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అన్నారు. ఇండస్ బుక్ ట్రస్ట్ నిర్వాహకుడు అరూరి సుధాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌ జన్యంతో మంగళవారం మండల కేంద్రంలోని సు ధా టెక్నో స్కూల్ ఆవరణలో యక్షగాన నాటక ఉ త్సవాలు కనుల పండువగా నిర్వహించారు. చిందు యక్షగాన పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై చిందు కళాకారులు పద్మశ్రీ గడ్డం సమ్మ య్య, గడ్డం శ్రీనివాస్, గడ్డం సంజీవ, గడ్డం రఘుపతి, సోమరాజు బృందాలు ప్రదర్శనలిచ్చాయి. అనంతరం పద్మశ్రీ గడ్డం సమ్మయ్యతో కలిసి డాక్టర్ సుధాకర్ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిందు యక్షగానం పురాణ గాథలను ప్రజలకు చేరవేసే వినోదాత్మక నాటకమన్నారు. శతాబ్దాలుగా చిందు కళాకారులు ఈ కళకు జీవం పోస్తున్నారని తెలిపారు.
పద్మశ్రీ గడ్డం సమ్మయ్య
Comments
Please login to add a commentAdd a comment