
ఆకు కూరలతో అధిక ఆదాయం..
మహబూబాబాద్ రూరల్: వేసవిలో ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందొచ్చు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అర్జించొచ్చు. ఈ క్రమంలో వేసవిలో ఆకు కూరల్లో ఏ రకం సాగు చేపట్టాలి? ఏ నేలలు అనుకూలం? ఎలా పండించాలనే విషయాలను మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాంబాబు.. రైతులకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
● ఆకు కూరల్లో పాలకూర, తోటకూర, పుదీన, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు ప్రధానమైనవి.
● ఆకు కూరల్లో లవణాలు, విటమిన్లు, మాంసకృతు లు, పీచు పదార్థం ఎక్కువ ఉండడంతో వేసవిలో ఆకు కూరలకు డిమాండ్ ఉంటుంది.
● తక్కువ కాలం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంట కావడంతో ఆకు కూరల సాగు బహుప్రయోజనకరంగా ఉంటుంది.
ఆకు కూరలసాగుకు నేల తయారీ ముఖ్యం..
● ఆకు కూరలు సాగుచేసే భూమిని నాలుగు, ఐదుసార్లు దున్ని, మట్టిపెల్లలు లేకుండా చూసుకోవాలి.
● ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేప పిండి, 100 కిలోల సూపర్ పాస్పేట్, 10 కిలోల జింకు సల్ఫేట్, 100 కిలోల ట్రైకోడెర్మా, 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌లు వేసి ఆకు, విత్తనాలను విత్తుకోవాలి.
ముఖ్య విషయాలు..
● ఆయా ప్రాంతాలకు అనువైన సాధారణ రకాలు, హైబ్రిడ్ రకాలను వేసుకోవచ్చు.
● తోట కూర విత్తనాలు చిన్నగా ఉంటాయి. అందుకే ఇసుకతో కలిపి చల్లుకోవాలి. ఎకరానికి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది.
● పాల కూర విత్తన బంతిలో 2 నుంచి 3 రకాల విత్తనాలు ఉంటాయి. విత్తనాలను మూడు నుంచి నాలుగు సెంటిమీటర్ల లోతులో విత్తుకోవాలి. లోతు ఎక్కువైతే మొలక సరిగా రాదు.
● ధనియాలను (కొత్తిమీర పంట) విత్తే సమయంలో రెండు సాల్లుగా చేయాలి. లేదంటే గింజలు ఆలస్యంగా మొలకెత్తి, మొలక శాతం బాగా తగ్గిపోతుంది. ఇందుకు గింజలను నేలపై పోసి చెప్పులు వేసుకుని కాళ్లతో సున్నితంగా రుద్దాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల విత్తనం సరిపోతుంది.
● కరివేపాకు విత్తనాలను చెట్టుకు ఉండే పండు నుంచి వేరు చేసిన వెంటనే విత్తుకోవాలి. ఆరితే మొలక శాతం తగ్గుతుంది.
● విత్తన శుద్ధికి జీవ శీలింధ్రనాశిని ట్రైకోడెర్మా 8 గ్రాములను కిలో విత్తనానికి పట్టించి విత్తితే వేరుకుళ్లు ఆశించవు.
● విత్తనం విత్తిన 48 గంటల లోపు భూమిలో తేమను చూసి లీటర్ నీటికి 4 మిల్లీ లీటర్ల పెండి మిథాలిన్ కలుపు మందును పిచికారీ చేయొచ్చు.
● పైపాటుగా పంట ఎదుగుదలకు లీటర్ నీటికి 5 గ్రాముల 19:19:19 పాలిఫీడ్‌ను కలిపి పిచికారీ చేయాలి.
● పంటకు అవసరం మేరకు నీరు అందించాలి. నీ రు ఎక్కువ అయితే వేరు కుళ్లు, కాండం కుళ్లు వచ్చే అవకాశం ఉంది. స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందించడం మంచిది. దీని వల్ల ఆకులపై ఉండే పురుగులు, నల్లులు, దుమ్ము, ధూళి రాలిపోతాయి.
సస్యరక్షణ..
● పేనుబంక, ఆకు ముడత, ఆకులను తినే గొంగళి పురుగులు ముఖ్యంగా ఆశిస్తాయి. వాటి నివారణకు రసాయన మందులను వాడకుండా వేప సంబంధిత మందులు వాడడం మంచిది. రసాయన మందులు వాడితే కనీసం వారం రోజుల తరువాత పంట కోయాలి.
● కత్తిరించే ఆకు కూర పంటలకు, కోత తర్వాత ఎకరాకు 10 కిలోల యూరియా వేస్తే మళ్లీ పంటకు వస్తుంది.
● ఆకులను మార్కెట్‌కు తరలించే సమయంలో గోనె సంచులకు బదులు కట్టలుగా కట్టి గాలి ప్రసరించే ట్రేలలో రవాణా చేయడం మంచిది.
వేసవిలో తక్కువ సమయంలో
ఎక్కువ దిగుబడి, లాభాలు
మల్యాల కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త
రాంబాబు
రైతులకు సలహాలు, సూచనలు

ఆకు కూరలతో అధిక ఆదాయం..

ఆకు కూరలతో అధిక ఆదాయం..

ఆకు కూరలతో అధిక ఆదాయం..

ఆకు కూరలతో అధిక ఆదాయం..

ఆకు కూరలతో అధిక ఆదాయం..
Comments
Please login to add a commentAdd a comment