పాఠశాల విద్యాశాఖ ఫోరం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి జిల్ల
విద్యారణ్యపురి: టీఎన్‌జీఓఎస్ పాఠశాల విద్యాశాఖ ఫోరం రాష్ట్రస్థాయి కార్యవర్గం ఎన్నికలు ఈనెల 17 వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు పలు పదవులు ద క్కాయి. హనుమకొండ జిల్లా విద్యాశాఖలో సీని యర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఫకృద్దీన్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అ సోసియేట్ ప్రెసిడెంట్‌గా భరత్, కోశాధికారిగా జనగామ నుంచి పవన్‌బాబు, కార్యవర్గ సభ్యుడిగా వ రంగల్ జిల్లా నుంచి ఎస్‌బీ శ్రీనివాస్, భూపాలపల్లి విద్యాశాఖలో పని చేస్తున్న దిలీప్‌కుమార్ పబ్లిసిటీ సెక్రటరీగా, ప్రశాంత్‌కుమార్ సభ్యుడిగా ఎన్నికయ్యారని బాధ్యులు మంగళవారం తెలిపారు.
సాఫ్ట్‌వేర్ లోపాలతో పత్తి కొనుగోళ్లలో అంతరాయం
● సీసీఐ సీజీఎం పాణిగ్రహి
వరంగల్: రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు చెందిన తక్‌పట్టీ సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న లోపాల కారణంగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లలో అంతరాయం కలుగుతోందని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐ) సీజీఎం(మార్కెటింగ్)ఎస్‌కే.పాణిగ్రహి మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన థర్డ్‌ఫార్టీ డేటా సెంటర్‌లో తీవ్ర నెట్‌వర్క్ అంతరాయంతో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. నెట్‌వర్క్ వ్యవస్థ పునరుద్ధరించిన వెంటనే సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తామని, రాష్ట్రంలో చివరివరకు వచ్చే పత్తిని ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి అందోళన చెందవద్దన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
● కాపాడబోయిన మహిళకు తప్పిన ప్రాణాపాయం
దేవరుప్పుల : దండెంపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా, అతడిని కాపాడబోయే క్రమంలో ఓ మహిళకు ప్రాణా పాయం తప్పింది. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ప్రాంతంలో ఉంటున్న నర్ర సోమయ్య(47) ఉదయం స్నానం చేసి దుస్తులు దండెంపై ఆరేస్తున్నాడు. ఈక్రమంలో అతుకులు ఏర్పడిన విద్యుత్ వైరు దండేనికి తగిలింది. దీనిని గమనించని నర్సయ్య దండెన్ని పట్టుకోగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌షాక్‌తో విలవిలాడుతున్న సోమయ్యను కాపాడేందుకు వచ్చిన స్థానికురాలు రాధిక.. మీటర్ ఆఫ్ చేసినా విద్యుత్ సరఫరా బంద్ కాలేదు. ఈ క్రమంలో మీటర్ బంద్ చేశానుకున్న ఆ మహిళ.. దండెంపై వైరు తీసే క్రమంలో విద్యుత్‌షాక్ తగలగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంతలో స్థానికుడు కందుల భిక్షపతి వచ్చి విద్యుత్ మీటర్ ఫ్యూజ్‌లు తీయడంతో రాధికకు ప్రాణాపాయం తప్పింది. ఈ విషయమై సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పాఠశాల విద్యాశాఖ ఫోరం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి జిల్ల
పాఠశాల విద్యాశాఖ ఫోరం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి జిల్ల
Comments
Please login to add a commentAdd a comment