ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోవాలి
మహబూబాబాద్ అర్బన్/మరిపెడ/గూడూరు: చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మానుకోటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 14 నెలల పాలనలో హామీ లు అమలు చేయక ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 317 జీఓ ద్వారా వేలాది మంది టీచర్ల జీవి తాలను ఛిన్నాభిన్నం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు, 317 జీఓ రద్దు ,6 నెలల్లో కొత్త పీఆర్సీ, డీఏ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మరిచిపోయిందని మండిపడ్డా రు. కాగా, బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీటీసీ సో మ్లా నాయక్, కాంగ్రెస్ నుంచి పల్స రవీందర్‌ను బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ అజ్మీరా సీతా రాంనాయక్, నాయకులు యాప సీతయ్య, భూక్య సంగీత, బాలరాజు, భాస్కర్‌రెడ్డి, రా మచందర్‌రావు, సుధీర్‌రెడ్డి, శ్యాంసుందర్‌శర్మ, గో వర్ధన్‌రెడ్డి, సతీశ్, వెంకన్న, మురళి, సురేందర్, మహేశ్, మోతీలాల్, నర్సింహరెడ్డి, అశోక్, సంపత్, సందీప్, అజయ్ పాల్గొన్నారు. అనంతరం మరిపె డ హైస్కూల్, గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా విద్యాలయంలో స రోత్తంరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. మొ దటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఆయాపాఠశాల్లో నిర్వహించిన ప్రచారంలో నాయకులు మహేశ్‌గౌడ్, జనార్దన్, రమేశ్, సురేందర్, పార్టీ గూడూరు అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment