స్వయం ప్రతిపత్తి హోదా
సుమతిరెడ్డి మహిళా కళాశాలకు
● ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లభించిందని ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ముఖ్య నగరాల్లోని కళాశాలలకు దీటుగా సుమతిరెడ్డి కళాశాలలో విద్యార్థినులను అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. తమ ఇంజనీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేసిన విద్యార్థినులు దేశ, విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అటానమస్ హోదాతో తమ కళాశాల కీర్తి మరింత పెరుగుతుందన్నారు. సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి హోదాతో కళాశాలకు అకడమిక్ మెరుగుదల, సాంకేతిక అభివృద్ధి, కళాశాల అభ్యున్నతి జరుగుతుందన్నారు. విద్యార్థినుల వ్యక్తిగత అభివృద్ధి, సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, వ్యాపారవేత్తలుగా నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాల వివిధ విభాగాధిపతులు డాక్టర్ ఇ. సుదర్శన్, డాక్టర్ కె. మహేందర్, డాక్టర్ ఎన్. శ్రీవాణి, ఏఓ వేణుగోపాలస్వామి, అధ్యాపక బృందం, విద్యార్థినుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. అటానమస్ హోదాకు అంకితభావంతో పనిచేసిన ఎస్‌ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి ఎ. మధుకర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీరెడ్డిని వరదారెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment