బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Published Wed, Feb 19 2025 12:58 AM | Last Updated on Wed, Feb 19 2025 12:57 AM

బుధవా

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

8లోu

రెండు నెలలుగా నిరీక్షణ

జిల్లాకు 152 గ్రూప్‌–4 ఉద్యోగాలు కేటాయించగా.. మున్సిపాలిటీ, కార్మికశాఖ, సివిల్‌ సప్లయీస్‌, విద్యాశాఖలో డిసెంబర్‌ 18నుంచి విధుల్లో చేరిన ఉద్యోగులు పైఅధికారులు చెప్పిన పనులు చేస్తున్నారు. రెవెన్యూశాఖకు 72 మందిని కేటాయించగా జిల్లాలో 43 పోస్టులకు మాత్రమే ఆర్థికశాఖ క్లియరెన్స్‌ ఉండడంతో మిగిలిన పోస్టులను అవసరాల మేరకు అడ్జెస్ట్‌ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్‌ తెచ్చుకున్నారు. దీంతో గ్రూప్‌–4 ఉద్యోగులకు.. కంప్యూటర్‌ ఆపరేటర్లు, పలు విభాగాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌ పనులను కూడా అప్పగించి ఎంప్లాయి ఐడీ, ప్రాన్‌ ఐడీ కేటాయించారు. అయితే దివ్యాంగులశాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖకు కేటాయించిన వారిని సీఎం ఆదేశాల మేరకు జాయినింగ్‌ చేసుకున్నా.. వారికి రెండు నెలలుగా ఆర్డర్స్‌ ఇవ్వలేదు. దీంతో దివ్యాంగుల శాఖకు కేటాయించిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. అదేవిధంగా డీఎంహెచ్‌ఓకు కేటాయించిన ఆరుగురిలో ఐదుగురు జాయిన్‌ అయినా.. వారికి ఇప్పటి వరకు ఐడీ, ప్రాన్‌ ఇవ్వలేదు. ఈ రెండు ఇస్తేనే వేతనాలు చేస్తారు. అయితే కొత్త పోస్టులు క్రియేట్‌ చేయాలంటే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ నుంచి పర్మిషన్‌ కానీ, జిల్లా కలెక్టర్‌ అప్రూవల్‌ కానీ ఉండాలని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు.

కొత్తగా ఉద్యోగంలో చేరిన గ్రూప్‌–4 ఉద్యోగులను ఎక్కడ నియమించాలి అనేది సందిగ్ధంగా ఉంది. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలో ఆర్డర్స్‌ ఇస్తాం. ముందుగా ప్రకటించిన ఖాళీల్లో కారుణ్య నియామకం ద్వారా వచ్చిన వారితో భర్తీ చేయడంతో సమస్య వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి జాయినింగ్‌ ఆర్డర్స్‌ ఇస్తాం.

త్వరలో ఆర్డర్స్‌ ఇస్తాం

పోస్టింగ్‌ ఆర్డర్స్‌ కోసం నిరీక్షణ

గ్రూప్‌–4 ఉద్యోగులకు తప్పని

ఎదురుచూపులు

పోస్టులు చూపించడం లేదని

ఐడీ, ప్రాన్‌ ఇవ్వని అధికారులు

ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు

సాక్షి, మహబూబాబాద్‌:

ష్టపడి చదివి గ్రూప్‌–4 ఉద్యోగం సాధించారు. ఎంతో సంతోషంతో ఉద్యోగంలో చేరారు. అయితే ఇలా ఉద్యోగంలో చేరారో లేదో అలా ఇబ్బందులు మొదలయ్యాయి. నోటిఫికేషన్‌ సమయంలో చూపించిన పోస్టులు.. ఉద్యోగంలో చేరేనాటికి లేకపోవడంతో నూతన ఉద్యోగులు కంగుతింటున్నారు. దీంతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకున్న కొందరు అధికారులు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వలేదు. కాగా ఉద్యోగంలో చేరి రెండు నెలలు గడుస్తున్నా.. పలుశాఖల ఉద్యోగులకు ఇప్పటి వరకు గుర్తింపు నంబర్‌, ప్రాన్‌ ఐడీ రాలేదు. దీంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉండగా పలువురు అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా చీదరించుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

అధికారుల తప్పిదం..

ఉద్యోగులకు శాపం

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌కు ముందు వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలను జిల్లా అధికారుల నుంచి తెప్పించుకుంటుంది. ఇందులో భాగంగానే 2022 డిసెంబర్‌ ఒకటో తేదీన గ్రూప్‌–4 నోటిఫికేషన్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో 152 గ్రూప్‌–4 ఉద్యోగ ఖాళీలు ఉన్న ట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. ఈ లోపు జిల్లాలో కారుణ్య నియామకాలు చేపట్టారు. ఈక్రమంలో గ్రూప్‌–4నోటిఫికేషన్‌లో చూపించిన ఖాళీలను కూడా భర్తీ చేశారు. ఈక్రమంలోనే గ్రూప్‌–4 ఫలితాలు వచ్చాయి. గత ఏడాది నవంబర్‌ 23న పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. తర్వాత అఽభ్యర్థులకు శాఖలు కేటాయించారు. అయితే తీరా ఆయా శాఖల్లో చేరేందుకు వచ్చిన ఉద్యోగులకు అక్కడ ఖాళీలు లేవనే విషయం తెలిసింది.

మాటలతో వేధింపులు

కొత్తగా ఉద్యోగంలో చేరిన తమ సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, పైగా సూటిపోటి మాటలతో మనోవేదనకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా చదివి పోటీని తట్టుకొని ఉద్యోగం సాధిస్తే ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో ఉద్యో గం సాధించిన సంతోషం లేకుండాపోయిందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించే మార్గం చూడాలని కోరుతున్నారు.

–మురళీధర్‌,

డీఎంహెచ్‌ఓ

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20251
1/3

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20252
2/3

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20253
3/3

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement