వరంగల్‌ టు మహారాష్ట! | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ టు మహారాష్ట!

Published Wed, Feb 19 2025 12:58 AM | Last Updated on Wed, Feb 19 2025 12:57 AM

వరంగల్‌ టు మహారాష్ట!

వరంగల్‌ టు మహారాష్ట!

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరి ధిలోని పాత మగ్దుంపురం గ్రామంలో సోమవా రం రూ.2.50 లక్షల విలువ చేసే 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత మగ్దుంపురం గ్రామానికి చెందిన ననుమా స కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కేయూసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కా జీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.32,500 విలు వైన 13 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నా రు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దేవన్నపేట శివారులో ఈ నెల 14న ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రూ.8.06 లక్షల విలువైన 310 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, ఓ లారీ, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు లీజుదారుడు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం బోర్నపల్లికి చెందిన కేశబోయిన మొగిలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

.. ఇలా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్‌ రైస్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం వయా హుజూరాబాద్‌, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతోంది. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్‌’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్‌, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్‌ బి య్యం దందా ఎల్లలు దాటుతోంది. ఈ దందా వెనుక కొందరు రైస్‌మిల్లర్లే కీల కం కాగా.. భీమదేవరపల్లి మండలా నికి చెందిన ఒకరు హసన్‌పర్తికి మకాం మార్చి ‘మేనేజ్‌’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్‌ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతు న్నా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరి స్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చి క్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది.

కమిషనరేట్‌ పరిధిలో ప్రధాన కేంద్రాలు..

● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్‌ బియ్యం అ క్రమ రవా ణాకు హసన్‌పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి.

● తరచూ పీడీఎస్‌ బియ్యం పట్టుబడుతున్నా హ నుమకొండ, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూ ర్‌ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్‌తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది.

● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేష న్‌ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్‌ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తు న్న బియ్యంపై ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ స మయంలో రేషన్‌ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది.

● ఈ దందాలో రూ.లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్‌లుగా మారుతున్నారు. రేషన్‌ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్‌ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్‌లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది.

● పీడీఎస్‌ దందాపై ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తని ఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్‌ బి య్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు ప్రకటించారు.

హుజూరాబాద్‌ మీదుగా సరిహద్దులు దాటుతున్న పీడీఎస్‌ రైస్‌

ప్రధాన కేంద్రాలు హనుమకొండ,

హసన్‌పర్తి, పరకాల శివార్లు

ఈ దందా వెనుక

భీమదేవరపల్లి మండల వాసి!

పీడీ యాక్టు, 6ఏ కేసులు,

అరెస్టులకు వెరవని మాఫియా

అక్రమార్కులకు వరంగా మారిన

ఉచిత బియ్యం పథకం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమాచారం

ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డులు : 11,05,543

(ఆహార భద్రత+అంత్యోదయ+అన్నపూర్ణ)

మొత్తం యూనిట్లు (కుటుంబ సభ్యులు) : 32,55,776

మండలస్థాయి స్టాక్‌ పాయింట్లు : 18

మొత్తం రేషన్‌ దుకాణాలు : 2,364

ప్రతినెల రేషన్‌ బియ్యం పంపిణీ : 33,153.976

మెట్రిక్‌ టన్నులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement