తల్లులూ.. చల్లంగ చూడండి
ఘనంగా తిరుగువారం పండుగ
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీజాతర (మండమెలిగె) ఈనెల 15న (శనివా రం) ముగిసింది. ఈ క్రమంలో బుధవారం మేడా రం, కన్నెపల్లి ఆలయాల్లో తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. మేడారం సమ్మక్క గుడిలో పూజారులు అమ్మవారి శక్తి పీఠాన్ని, అమ్మవారి శక్తి పీఠం గద్దెను అలంకరించారు. అనంతరం సమ్మక్క శక్తి పీఠాన్ని ఐదుగురు పూజారుల చేతుల మీదుగా గద్దె పై పెట్టారు. తర్వాత అమ్మవారికి సారా, కల్లు, పాలను ఆరగింపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగువారం పండుగ సందర్భంగా పూజారులు కుటుంబీకులు, ఆదివాసీలు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. అలాగే, కన్నెపల్లి సారలమ్మ గుడిలో పూజారులు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. సారలమ్మ గుడి వడేరాల కుండలు, గంటలు, వస్త్రాలు శుద్ధి చేసి పూజలు నిర్వహించిన అనంతరం భద్రపరిచారు. పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కుటుంబ సమేతంగా సమ్మక్క గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, నితిన్, మహేశ్, సిద్ధబోయిన భోజారావు, దశరథ, కొక్కెర కృష్ణయ్య, దూపవడ్డె నాగేశ్వరరావు, మల్లెల సత్యం, పూర్ణ, సిద్ధబోయిన నర్సింగరావు, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మినీజాతర ముగిసిన నేపథ్యంలో వచ్చే ఏడాది మహాజాతరకు ప్రభుత్వ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఎండోమెంట్ సూపరిండెంటెంట్ క్రాంతికుమార్, జూనియర్ అసిస్టెంట్లు బాలకృష్ణ, జగదీశ్.. భక్తులకు సేవలందించారు.
అమ్మవార్లకు భక్తుల
తిరుగువారం మొక్కులు..
తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు వేలాదిగా మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు షవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుగువారం పండుగతో మినీ జాతర పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఈనెల 23న (ఆదివారం) ఆనవాయితీగా పూజారులు వనభోజనాలు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పూనుగొండ్ల గ్రామంలో..
గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు తిరుగువారం జాతర బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు ఆరబోశారు. కార్యక్రమంలో పెనక పురుషోత్తం, పెనక రాజేశ్, పెనక సాంబయ్య, రామస్వామి, వెంకటయ్య, వడ్డె కల్తి జగ్గారావు, పెనక సమ్మయ్య, పెనక రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
నిర్వహించిన పూజారులు
మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో
మొక్కుల చెల్లింపులు
తరలివచ్చిన వేలాది మంది భక్తులు
ముగిసిన మినీ మేడారం జాతర
తల్లుల దీవెనలతో జాతర విజయవంతం..
సమ్మక్క, సారలమ్మల దీవెనలతో మినీ జాతర విజయవంతమైంది. స్థానిక ఆదివాసీ బిడ్డ, మంత్రి సీతక్క ఈ సారి మినీ జాతరపై ప్రత్యేక దృష్టి సారించి రూ.5 కోట్లు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, జిల్లా అధికారుల సమన్వయంతో మినీజాతర విజయవంతమైంది. మళ్లీ మహాజాతర నాటికి ప్రభుత్వం మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి.
– సిద్ధబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు
తల్లులూ.. చల్లంగ చూడండి
తల్లులూ.. చల్లంగ చూడండి
Comments
Please login to add a commentAdd a comment