ఆర్టీసీ అభివృద్ధికి ప్రతీ ఉద్యోగి కృషి చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ అభివృద్ధికి ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను అన్నారు. బుధవారం హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజినల్ మేనేజర్ డి.విజయభానుకు ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ నూతన కమిటీని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.నిరంజన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం విజయభానును సన్మానించారు. ఆర్‌ఎం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఆ దాయం పెంచుతూ సంస్థకు మంచి పేరు తీసుకురా వాలన్నారు. ఆర్టీసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని కోరారు. అనంతరం డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేషన్స్) కేశరాజు భానుకిరణ్‌కు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ కమిటీని పరిచయం చేసి సన్మానించారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ చీఫ్ అడ్వయిజర్ ఎం. ఎస్.రావు, రీజియన్ అధ్యక్షుడు గొలనకొండ వే ణు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు వి.అంజనీదేవి, వేము ల రవి, ఉపాధ్యక్షుడు ఎం.మంజుల, కార్యదర్శి మా దారపు సాంబయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ దద్దనాల ఉమాదేవి, కోశాధికారి పి.రాధిక, నాయకులు జి. ఎస్.పాణి, కె.దేవేందర్, కె.ప్రభాకర్ పాల్గొన్నారు.
● వరంగల్ ఆర్‌ఎం విజయభాను
Comments
Please login to add a commentAdd a comment