హన్మకొండ: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. వేసవిలో పెరగాల్సిన డిమాండ్ ఈసారి ఫిబ్రవరిలోనే పెరిగింది. ఫలితంగా ఈ నెల 10న అత్యధికంగా రాష్ట్రంలో 15,998 మెగావాట్లకు చేరుకుంది. బుధవారం విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు చేరుకుంది. అదే విధంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 10న విద్యుత్ సరఫరా డిమాండ్ 5,361 మెగావాట్లు ఉండగా బుధవారం 5,497 మెగావాట్లకు చేరుకుంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతుండడంతో విద్యుత్ ఉపకరణాలు వినియోగం పెరిగింది. ఏసీలు, కూలర్లు వాడుతుండడంతో పాటు పంటల సాగుకు నీటి అవసరాలు పెరుగడంతో భూగర్భ జలాలు తోడేందుకు విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ సరఫరా డిమాండ్ పెరిగింది.
బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా 16,058 మెగావాట్లు
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,497..
Comments
Please login to add a commentAdd a comment