● వివరాలు వెల్లడించిన సీఐ క్రాంతికుమార్
పరకాల: పరకాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణ మైన ఇద్దరి నిందితులకు జైలు శిక్షపడింది. పరకాల సీఐ క్రాంతికుమార్ కథ నం ప్రకారం.. 2015లో పరకాలలోని ఎం.ఆర్ రెడ్డి కళాశాల సమీపంలో ద్విచక్రవా హనంపై వెళ్తున్న హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పుట్ట యుగేంధర్‌ను మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్న నిజాంపల్లి గ్రామానికి చెందిన కుంచాల లింగమూర్తి ఢీకొన్నాడు. దీంతో యుగేంధర్ కిందపడిపోగా..అదే సమయంలో లారీ అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై దీపక్ కేసు నమోదు చేయగా కోర్టు కానిస్టేబుల్ నాగరాజు, సారంగపాణి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న పరకాల అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శాలినిలింగం.. నిందితులు ఇద్దరు లింగమూర్తికి 2 సంవత్సరాలు, లారీ డ్రైవర్ ఎస్.డి యాసిన్ పాషాకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఇద్దరికి రూ.6వేల జరిమానా విధించినట్లు సీఐ క్రాంతికుమార్ బుధవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment