వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట బుధవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సుబేదారి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. కాజీపేటకు చెందిన ఓ మహిళ రెండో వివాహం చేసుకుంది. అనంతరం రెండో భర్తపై అత్యాచారం కేసు పెట్టింది. ఆ కేసు విషయంలో సదరు మహిళ అక్కాబావ సాక్షులుగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం కోర్టులో సదరు మహిళ అక్కాబావ గొడవ పెట్టుకున్నారు. అనంతరం ఏం విషయంలో.. ఏం జరిగిందో తెలియదు కానీ సదరు మహిళ.. అక్కాబావపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీ కార్యాలయంలో ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా భద్రతా సిబ్బంది అడ్డుకుని సుబేదారి పీఎస్‌కు తరలించారు. ఈ ఘటనలో సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment