మానసిక సంసిద్ధత
సాక్షి, మహబూబాబాద్: సహజంగానే విద్యార్థులకు పరీక్షలు అంటే భయం ఉంటుంది. అందులో పదో తరగతి పరీక్షలంటే మరింత ఎక్కువ భయపడతారు. దీనికి తోడు తరచూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధికారులు, తల్లిదండ్రులు ఉత్తమ మార్కులు తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తా రు. దీంతో విద్యార్థుల్లో భయంతో పాటు సందిగ్ధం నెలకొంటుంది. కాగా పదో తరగతి విద్యార్థులను మానసికంగా సంసిద్ధం చేసేందుకు జిల్లా విద్యాశా ఖ అధికారులు మోటివేషన్ కార్యక్రమ నిర్వహణకు సిద్ధమయ్యారు. భయం వీడండి.. బాగా చదవండి అంటూ విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తున్నారు.
ఇటీవల జరిగిన సంఘటనలతో..
విద్యాశాఖ, అధికారుల పనితీరుకు పదో తరగతి ఫలితాలు ప్రామాణికం అనే ప్రచారం జరుగుతోంది.దీంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే వి ద్యార్థులపై ఒత్తిడి పెంచేలా పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతీ పాఠశాలలో మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ప్రతీ పాఠశాల నుంచి ఒకరు..
పదో తరగతి విద్యార్థులకే కాకుండా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా టెన్త్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ కార్యక్ర మానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బో ధించే నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి శిక్షణకు పంపించారు. పదిరోజుల పాటు శిక్షణ పొందిన నలుగురు మాస్టర్స్ ట్రైనర్స్ జిల్లాలోని 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 15 కేజీబీవీలు, ఎనిమిది మోడల్ స్కూల్స్ మొత్తం 215 పాఠశాలల నుంచి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని ఎంపిక చేశారు. వీరికి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారు బోధించే పా ఠశాలల్లో పరీక్షలు అంటే భయం పొగొట్టడంతో పాటు ఒత్తిడి లేకుండా చదవడం, పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తున్నారు.
సులభంగా బోధించేందుకు..
ఒక వైపు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తూనే.. పరీక్షలు అంటే భయం పోయేవిధంగా సులభంగా బోధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పరీక్షలు అంటే భయం వీడేందుకు 25శాతం సిలబస్‌తో 28 రివిజన్ టెస్ట్‌లు నిర్వహించి ఆ ఫలితాల ఆధారంగా బోధన చేయడం, గత నాలుగు, ఐదు సంవత్సరాల పరీక్ష పేపర్లు తీసుకొని వాటిలోని ప్రతీ ప్రశ్నకు విద్యార్థి సమాధానం రాసేలా సిద్ధం చేస్తున్నారు. వార్షిక పరీక్షలు ప్రారంభం నాటికి సిలబస్ కవర్ అయ్యేలా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
టెన్త్ విద్యార్థులకు మోటివేషన్ తరగతులు
పరీక్షలపై భయం తొలగేలా కౌన్సెలింగ్
వందశాతం ఫలితాల కోసం ప్రణాళికలు
జిల్లాలో 8,192 మంది
పదో తరగతి విద్యార్థులు
పరీక్షలంటే భయం వీడాలి
మరిపెడ: పరీక్షలంటే భయం వీడాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మరిపెడలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబర్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను బుధవారం రాత్రి కలెక్టర్ సందర్శించారు. స్టడీ అవర్‌లో విద్యార్థుల వద్దకు వెళ్లి పరీక్షల సంసిద్ధతపై అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులో ఏమైన సమస్యలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల సమయం కావడంతో మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని సూచించారు. వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించి నిత్యం శానిటేషన్ చేయాలన్నారు.
జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు..
పాఠశాల సంఖ్య విద్యార్థులు
జిల్లా పరిషత్ 97 2,932
ప్రభుత్వ 02 134
కేజీబీవీలు 15 496
మోడల్ స్కూల్స్ 08 735
ఏజెన్సీ హైస్కూల్స్ 18 764
అన్ని రకాల గురుకులాలు 19 1,282
ప్రైవేట్ 45 1,849
మొత్తం 204 8,192
బాలురు : 4,189
బాలికలు : 4,003
Comments
Please login to add a commentAdd a comment